నిజాం రాజులు, కాకతీయుల పరిపాలనలో తెలంగాణలో ఎన్నో కోటలు నిర్మాణాలు జరిగియాయి. రాజులూ రాజ్యాలు అన్ని పోయిన అప్పటికి కోటల గుర్తులు ఉండిపోయాయి నేటికీ పురాతన కట్టడాలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా లో రాజుల పాలనకు సంబంధించి కొన్ని కట్టడాలు ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. చరిత్రకు నిదర్శనమైన ఓ కోటనే మెదక్ ఖిల్లా.. అప్పటి రాజుల పరిపాలించారని సాక్ష్యంగా చెప్పుకునే ఈ ఖిల్లా ఒక వారసత్వ నిర్మాణానికి పర్యాటక ఆకర్షణ గా నిలిచింది. అంతేగాక ఇది తెలంగాణ ప్రాంతంలో చారిత్రక, నిర్మాణనికి ఓ ప్రాముఖ్యతను చెంది ఉంది.
కాకతీయ సామ్రాజ్యపు రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్యన్నీ రక్షించడం కోసం నిర్మించబడిన ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను రహస్యంగా మార్చేసింది. ఎత్తైన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు, కోటకు ఎక్కడానికి వేలు లేకుండా కట్టిన ఎత్తైన గోడలు, కొండదారి కోటలో వారికి శత్రువులు కనిపిస్తారు . కానీ శత్రువుకు కోటలో ఏముందో, ఎక్కడ ఎలా చంపుతారో తెలియని పరిస్థితి. కోటలో దిగుడు బావులు, సొరంగ మార్గాలు కూడా నిర్మించారు. అంతేకాదు తాగు నీటి సరఫరా కొరకు కుండ పెంకులతో పైప్‌లైన్లు కూడా నిర్మించారు. ఢిల్లీ సుల్తాన్ల దాడులూ దండయాత్రలూ మొదలవ్వగా.. సుల్తాన్ల పాలన లో ఈ కోటలో ఇస్లామిక్ రీతి లో కట్టడం జరిగింది. ఈ కోట మీద నుంచి పర్యాటకులు మంచి దృశ్యాలతో పాటు పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.
హైదరాబాదు కు వంద కిలో మీటర్ల దూరంలో.. మెదక్ నగరానికి ఉత్తరంలో మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించిన మెదక్ కోట నేషనల్ హైవే 44 కి దగ్గరగా, చేగుంట అనే చిన్న పట్టణం నుండి ఓ మలుపు తీసుకొని రావాలీ . హైదరాబాద్ బాలానగర్ నుండి వస్తే 80 km రావాల్సి ఉంటుంది.